Anchor Pradeep: తెలుగు బుల్లితెరపై ఎంతోమంది లేడీ యాంకర్స్ ఉండగా మేల్ యాంకర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి.అయితే ఇలా మేల్ యాంకర్స్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ఈయన బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వెండితెర సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఇదివరకు ప్రదీప్ పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రలో నటించగా తాజాగా ఈయన 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ప్రదీప్ నటన పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ సినిమాల గురించి ఎలాంటి విషయాన్ని ప్రకటించలేదు. ఇకపోతే ప్రదీప్ ఏ కార్యక్రమానికి వెళ్లిన తరచు ఆయన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి.
ఇప్పటికే మూడు పదుల వయసు దాటుతున్న కూడా ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తరచూ ఎక్కడికి వెళ్లినా ఈయన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ కు మరోసారి తన పెళ్లి గురించి ఎదురైంది.మీరు పెళ్లి చేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి నిజంగానే పెళ్లి చేసుకున్నారా అంటూ ప్రశ్నించగా ప్రదీప్ తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
తను ఒకసారి కాదు నాలుగైదు సార్లు పెళ్లి చేసుకున్నాను మీరు యూట్యూబ్ లో చూడలేదా అంటూ తనపై తానే కౌంటర్ వేసుకున్నారు.ఇలా ప్రదీప్ ప్రమేయం లేకుండానే అతనికి పెళ్లి జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రదీప్ తన పెళ్లి గురించి ఇలా స్పందించారు. మొత్తానికి ప్రదీప్ తన పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…