Prabhas: బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన సలార్ ప్రాజెక్టుకే వంటి సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
కృష్ణంరాజు గారి మరణం తర్వాత సినిమా షూటింగ్లకు కాస్త విరామం ఇచ్చిన ప్రభాస్ కృష్ణంరాజు గారి సంస్కరణ సభలన్నీ పూర్తయిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నటువంటి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇకపోతే సాధారణంగా సినిమా షూటింగ్లో జరుగుతున్న సమయంలో కొన్ని సన్నివేశాలు లీక్ అవడం సర్వసాధారణం.
ఇలా లీకులు కాకుండా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పెద్ద ఎత్తున కొన్ని సన్నివేశాలు లీక్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనగా ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ అదిరిపోయే లుక్ లో కనిపించడంతో అభిమానులు సైతం ప్రభాస్ కటౌట్ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ప్రభాస్ సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ కె వంటి సినిమా షూటింగులలో కూడా పాల్గొనబోతున్నారు.ఈ రెండు చిత్రాల అనంతరం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పిరిట్ సినిమాలో ఈయన బిజీ కానున్నారు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…