Featured

Kona Venkat : నేను చేసిన సినిమాకి కూడా నా పేరు వేయలేదు.. శీను వైట్ల లో మరో కోణం బయటికి వస్తే.. అంతా నేనే అంటాడు : కోన వెంకట్

Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిపోయిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల, కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు.

శీను వైట్లలో మరో వ్యక్తి బయటికి వస్తే అంతా నేనే అంటాడు…

‘దూకుడు’ సినిమా పూర్తవుతున్న సమయంలోనే ఆగడు గురించి చర్చ మొదలయింది. ఆ సమయంలో దూకుడు సినిమా కోసం అందరం కష్టపడితే అందరితో మాత్రం తానే అన్ని చేసుకున్నట్లు శీను వైట్ల చెప్పుకున్నాడు. ప్రొడ్యూసర్లు మరి ఇంకా వాళ్ళు ఎందుకు అని మా గురించి మాట్లాడారు. ఇక ఆ ఇష్యూ తరువాత అన్ని తానే చేసుకుంటున్నపుడు మేమెందుకు అని వచ్చేసాం. గుర్తింపు లేని చోట పని చేయలేము అంటూ చెప్పారు కోన వెంకట్. అనిల్ రావిపూడి అపుడు మాతోనే ఉన్నాడు.

అతను మాత్రం ఏం చేస్తాడు చెప్పి చూసాడు కానీ శీను వినలేదు. అనిల్ మాకు బాగా క్లోజ్ నేను అనిల్ రావిపూడి, బాబీ అందరం సినిమాల గురించి చర్చ ఎక్కువగా చేసే వాళ్ళం, నాతో బాబీ ఉండేవాడు అంటూ కోన చెప్పారు. కోన తాను నటుడుగా కూడా ‘ఎందుకంటే ప్రేమంటే’ సినిమాలో నటించాడు. గతంలో శీను వైట్ల అలా చేసాడు అంటూ చెప్పి ఇపుడు వాటి గురించి మాట్లాడటం వల్ల వచ్చేదేమీ లేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago