Senior Journalist Bhardwaja : ఏపీ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్పు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఇష్యూ మీద టీడీపీ పార్టీ శ్రేణులు, నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు. మార్చవద్దంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఇలా స్పందించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన మాత్రం టీడీపీ శ్రేణులకే కాదు నందమూరి అభిమానులకు రుచించలేదు. తారక్ ఇలా ఎందుకు మాట్లాడాడు, ఎన్టీఆర్ ను వైస్సార్ తో పోల్చడమేంటి అంటూ అక్షేపించారు. ఇక ఈ విషయం మీద ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. చాలా ఘాటుగా ప్రభుత్వం గురించి, సీనియర్ రాజకీయ నేతల గురించి మాట్లాడారు. ఇక ఈ విషయంలో సీనియర్ భరద్వాజ గారు బాలకృష్ణ అన్న కుక్కలు ఎవరు అంటూ మాట్లాడారు.
బాలకృష్ణ టార్గెట్ చేసిన ఆ వ్యక్తులు ఎవరు…
సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరును మార్చి వైస్సార్ పేరు పెట్టడం అక్షేపనీయం అంటూ చెప్పారు. ఇక ఈ విషయంలో బాలకృష్ణ సిగ్గులేని కుక్కలు అంటూ మాట్లాడింది కోడలినాని మొదలయిన వారి గురించి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను కూడా టచ్ చేసాడు అని అనిపిస్తోంది అంటూ చెప్పారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ గారు ఇలా పేర్లు పెట్టలేదు ఆ తరువాత వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ అయినా ఆయన పేరును స్టేడియం కి పెట్టాడు. ఇక వెంగలరావు పార్క్ అని పెట్టారు.
బాలయోగి టర్మినల్ ఇలా ఇతరుల పేర్లు పెట్టారు. అయితే జగన్ చేసిన పని ఇంట్లో వాళ్లకే నచ్చలేదు. షర్మిల కూడా దీన్ని వ్యతిరేకించింది. వైస్సార్ డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్సిటీ కి ఆయన పేరు పెట్టడం సమంజసం అనడం తప్పు, ఆ యూనివర్సిటీ రావడానికి కృషి చేసింది ఎన్టీఆర్ గారు, ఆయన మరణించాక ఆయన పేరు ఆ యూనివర్సిటీకి పెట్టారు. ఆయన కేవలం సినిమా హీరో కాదు సీఎం కూడా అది మర్చిపోతే ఎలా జగన్ అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఇక విపక్షలకు సమాధానం చెప్పాలంటే ప్రభుత్వం నీ హయాంలో చేసారు అనే మాట అంటోంది, అంతే కానీ మేము ఎందుకు చేశామనే వివరణ కరెక్ట్ గా ఇవ్వలేదు అంటూ అభిప్రాయపడ్డారు భరద్వాజ.
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…