Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బుల్లితెరపై యాంకర్లుగా చేసిన వారందరూ కూడా వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే రశ్మి సైతం పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈమెకు వెండితెరపై ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదని చెప్పాలి. ఇలా వెండితెరపై రష్మికి సరైన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి గుర్తింపు రాకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రష్మీ మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలతో కలిసి ఓపెన్ హార్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రష్మి పలువురు సెలబ్రిటీలను అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఇంద్రజ సైతం రశ్మిని ప్రశ్నిస్తూ టెలివిజన్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మి వెండితెరపై ఎందుకు రాణించలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు.తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే రాత్రికి రాత్రికి నా పాత్రలు మారిపోతున్నాయని తెలియజేశారు.
సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు వీళ్ళే చేయగలరు అనే స్టాంప్ ఉంది కొందరు తల్లి పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు చెల్లెలు పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు సెకండ్ హీరోయిన్గా మాత్రమే పరిమితం అనే స్టాంపు ఉంది. అయితే తనపై కూడా అలాంటి స్టాంప్ పడిన కారణంగా మంచి పాత్రలలో నటించే అవకాశం రాలేదని అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…