Anchor Rashmi Gowtham : ఈటీవీ లో వస్తోన్న షోలన్నింటిలో జబర్దస్త్ కి ఎక్సట్రా జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ మరే షోకి లేదు. కామెడీ షో అయిన జబర్దస్త్ ప్రారంభం అయి ఇప్పటికి ఏళ్ళు గడుస్తున్నా ఈ షోకి రేటింగ్స్ మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి. ఇక ఈ జబర్దస్త్ షోకి అనసూయ యాంకర్ గా మొదలై మళ్ళీ అనసూయ వెళ్ళిపోయాక రష్మీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మళ్ళీ అనసూయ జబర్దస్త్ కి రావడంతో ఎక్సట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకర్ గా కంటిన్యూ అవుతూ వచ్చింది. అప్పటినుండి ఇప్పటి దాకా రష్మీ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూ వస్తూ మిగిలిన ఈటీవీ షోలు అయిన ఢీ, శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఇక పండగ ఈవెంట్స్ వంటివి చేస్తూనే ఉంది. బయటి ఛానెల్స్ నుండి ఆఫర్స్ వచ్చినా రష్మీ మల్లెమాల సంస్థ నుండి బయటికి రాలేదు. ఇప్పుడు అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పడంతో మళ్ళీ రష్మినే జబర్దస్త్ కి దిక్కయింది. కానీ ఇపుడు మరో కొత్త యాంకర్ జబర్దస్త్ లో కనువిందు చేయనుంది.
కొత్త యాంకర్ మీద రష్మీ కామెంట్స్…
జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ గురించి రష్మీ మాట్లాడుతూ తనకు లైఫ్ ఇచ్చిన షోస్ వాటిని వదిలిపెట్టలేను అంటూ మాట్లాడారు. మల్లెమాల నా కుటుంబం అనుకుంటాను అందుకే వేరే ఛానెల్స్ నుండి అవకాశాలు వచ్చినా వెళ్లాలని అనుకోలేదు అంటూ రష్మీ క్లారిటీ ఇచ్చింది. ఇక జబర్దస్త్ కి కొత్తగా సౌమ్య అనే యాంకర్ రావడం గురించి రష్మీ మాట్లాడుతూ అనసూయ వెళ్ళిపోయాక నన్ను కొన్ని ఎపిసోడ్స్ ఎంగేజ్ చేయమన్నారు చేశాను ఇప్పుడు కొత్త యాంకర్ వచ్చింది. నాకు ఏ అభ్యంతరం లేదు. ఒకవేళ ఆమె ఏదైనా బిజీ ఉండి ఎపుడైనా రాకపోతే మళ్ళీ జబర్దస్త్ యాంకర్ గా చేస్తా అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది.
మల్లెమాల నా కుటుంబం లాంటింది. నాకు ఎంతో ఇచ్చిన మల్లెమాల సంస్థలో ఏదైనా ఇబ్బంది కలిగినా నేను నావంతు సహాయం చేస్తాను అంటూ కొత్త యాంకర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈటీవీ వార్షికోత్సవ పండగలో మెరిసిన భార్యామణి సీరియల్ హీరోయిన్ సౌమ్య తన టైమింగ్ కామెడీతో ఆ ఈవెంట్ లో ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా జబర్దస్త్ యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఇక వచ్చీరాగానే రష్మిని అనుకరించి జబర్దస్త్ యాంకర్ అనిపించుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…