Featured

KA Paul : నాకు మూడు ఓట్లనా?? న్యాయం కోసం సుప్రీం కోర్ట్ కి వెళ్తా : కే ఏ పాల్

KA Paul : తెలంగాణ ఉప ఎన్నిక ఎంత రసవత్తరంగా మారిందో అందరికీ తెలుసు. ఆల్రడీ సిట్టింగ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి బీజేపీ లోకి వెళ్లిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక కాంగ్రెస్ స్థానం నిలుపుకోవడం కోసం కష్టపడితే ఎలాగైనా గెలిచి బీజేపీ బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. ఇక అధికార పక్షమైన తెరాస కోల్పోయిన స్థానాన్ని మళ్ళీ దక్కించికోవాలని సర్వశక్తులూ ప్రయోగించింది. అయితే ప్రచారం ముగిసి ఎన్నిక జరిగే రోజుకు వచ్చేసరికి బీజేపీ, తెరాస మాత్రమే మిగిలాయి. కాంగ్రెస్ మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయింది. అయితే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడిన తెరాస బీజేపీ లలో తెరాస గెలిచి తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ ఎన్నికలో అక్రమాలు జరిగాయాంటూ కేఏ పాల్ ఆరోపణలు చేస్తున్నారు.

నాకు పడిన ఓట్లు మూడేనా…

ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ ఓట్ల లెక్కింపు తరువాత మాట్లాడుతూ తెరాస కుట్ర చేసింది అంటూ ఆరోపించారు. మునుగోడు లో 40 నుండి 60 శాతం వరకు మా పార్టీ కి ఓట్లు వేసారంటూ ప్రెస్ మీట్ లో పాల్ చెప్పారు. ఇక ఒక గ్రామంలో దాదాపు రెండున్నర వేల ఓట్లు మాకు పడితే లెక్కంచిన తరువాత కేవలం మూడు ఓట్లే పోలయ్యాయంటూ ఆరోపించారు. అయితే ఈవీఎం లతో ఎలక్షన్ జరపవద్దని ఎప్పటి నుండో చెబుతున్నా పట్టించుకోవడం లేదు, తెరాస పార్టీ కి అధికారులు తొత్తులుగా మారి ఈవీఎం టాంపరింగ్ చేసారని, పోలీసులు పక్కా తెరాస పార్టీ కార్యకర్తలుగా వ్యవహారిస్తున్నారు అంటూ ఆరోపించారు.

బ్యాలెట్ తో ఎన్నికలు జరిగితే ఓట్లన్నీ మా పార్టీకే పడతాయాని బ్యాలెట్ పద్దతిలో ఎన్నిలు జరుపలేదని చెప్పారు. ఎలక్షన్ అధికారులు వికాస్ కృష్ణ, రోహిత్ సింగ్ లను వివరణ అడిగినా స్పందించలేదు. అన్ని సాక్ష్యధారాలతో సుప్రీం కోర్ట్ లో ఈ ఎన్నికల ఫలితం మీద కేసు వేస్తాను, నూరు శాతం ఈ ఎన్నిక తప్పు అని నిరూపిస్తాను అంటూ చెప్పారు. తెరాస కి అనుకూలంగా బూత్ ఏజెంట్లు అలాగే ఎన్నికల అధికారులు పనిచేసారు అంటూ కే ఏ పాల్ ఆరోపించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago