Director Geetha Krishna : తెలుగులో హీరోయిన్ గా అగ్ర స్థానంలో ఉన్న సమంత నాగచైతన్య తో వివాహం జరిగి అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లినా కూడా సినిమాలను చేస్తూ తనని తాను ఛాలెంజింగ్ పాత్రలతో నిరూపించుకుంటూ ఉంది. అయితే కారణాలు ఏవైనా ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నా ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అనుకున్నా ఆమె మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకెళ్ళింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంది. ఇక అంతా బాగుందనుకునే లోపే సమంతకు ఆటో ఇమ్మ్యూన్ సమస్యతో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే సమంత తాజాగా యశోధ సినిమా ప్రమోషన్స్ కోసం సుమతో ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో చాలా ఎమోషనల్ గా తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం ఇదంతా బాగా వైరల్ అయింది. అయితే ఇదంతా ప్రమోషన్స్ స్ట్రాటెజీ అంటూ డైరెక్టర్ గీతా కృష్ణ గారు అభిప్రాయపడ్డారు.
పబ్లిసిటీ కోసం డ్రామా…
సమంత మోడల్ గా ఉన్న సమయం నుండి తనకు పరిచయం ఉంది అంటూ చెప్పిన గీతా కృష్ణ ఆమెకు కడలి సినిమా సమయంలోనే హీరోయిన్ గా ఎంపిక అయినా సముద్రంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వస్తుంది అని తనకు చర్మ సంబంధ వ్యాధులు ఉండటం వల్ల తప్పుకుంది అంటూ వివరించారు. నిజంగా వ్యాధి తీవ్రంగా ఉండి బాధపడుతుంటే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనదు. కేవలం తన మీద సింపతి క్రియేట్ చేసుకోవాలని అనుకుంది.
తనకు నిజంగా వ్యాధి ఉన్నా అది సీరియస్ కాదు, చికిత్స చేయించుకుంటోంది, చూసుకోడానికి తల్లిదండ్రులు ఉన్నారు అలాంటప్పుడు కన్నీరు పెట్టుకుని వీడియో చేయాల్సిన అవసరం లేదు. తాజాగా సమంత విడాకులు తీసుకోవడం, ఐటమ్ సాంగ్స్ చేసి గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ తన ఇమేజ్ సోషల్ మీడియాలో నెగెటివ్ గా ఉండటం వల్ల తను ఆ ఇమేజ్ ను మార్చుకోడానికి సినిమా హిట్ చేసుకోవడం కోసం తన వ్యాధి గురించి పబ్లిక్ కు చెప్పింది అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…