Movie News

Senior Journalist Bhardwaja : డైరెక్టర్ రాజా చంద్రను చంపి చెన్నై నడిరోడ్డు మీద పడేసారు… చంపింది ఆ టాప్ హీరోయిన్… ఆమె ఎవరో దాసరికి తెలుసా?? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : దాసరి నారాయణ రావు గారి శిష్యుల్లో ఒకరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజా చంద్ర గారి అసలు పేరు వెంకటేశ్వరరావు, ఈయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు. రాజా చంద్ర గారు దాసరి గారి వద్ద చాలా సినిమాలకు పని చేసిన ఆయన విజయబాపిణీడు గారి నిర్మాణంలో మొదటి సారిగా బొమ్మరిల్లు అనే సినిమా డైరెక్ట్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వరుసగా సినిమాలను చేసిన ఆయన అనుమానస్పద రీతిలో చెన్నై రోడ్డు మీద శవంలా కనిపించడం అందరినీ అప్పట్లో షాక్ కి గురిచేసింది.

చంపింది ఎవరో ఇప్పటికీ తెలియదు…

రాజచంద్ర గారికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నా మళ్ళీ నటి కృష్ణవేణి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కృష్ణవేణి గారు నగ్న సత్యం సినిమాతో సినిమాల్లోకి వచ్చి ఆ తరువాత మాదాల రంగారావు గారి సినిమాల్లో నటించింది. ఆ తరువాత రాజచంద్ర గారి డైరెక్టన్లో కామెడీ పాత్రలను ఎక్కువగా చేసారు. అలా ఏర్పడిన పరిచయంతో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కృష్ణవేణి కి కూడా పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది. భర్తను వదిలి జీవినార్థం చెన్నై సినిమాల్లో అవకాశాల కోసం ఆమె వచ్చారు.

ఇక డైరెక్టర్ గా మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో 1987 లో రాజచంద్ర ను చంపి చెన్నై రోడ్డులో పడేసి వెళ్లిపోయారు. చంపింది ఎవరో ఇప్పటికీ తెలియదు కానీ కృష్ణ వేణి ఇప్పటికీ ఇంటర్వ్యూల్లో ఆయనను చంపించింది అప్పట్లో ఒక అగ్ర హీరోయిన్ అంటూ ఇప్పుడు ఆమె మరణించింది అంటూ చెప్తుంటుంది కానీ ఆ హీరోయిన్ ఎవరో మాత్రం చెప్పరు. దాసరి గారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్నా కూడా అతని హత్య వెనుక ఉన్నది ఎవరన్న సంగతి తెలియలేదు. ఆయన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఆయనది హత్య అని తెలియదు అంటూ రాజా చంద్ర గారి ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago