బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న టువంటి యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యాంకరమ్మ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని అభిమానులను సందడి చేస్తోంది.ఒకవైపు యాంకర్ గా విధులు నిర్వహించడమే కాకుండా మరోవైపు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ, పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు అంటే అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని ఆ సెలబ్రిటీలను ఎన్నో ముప్పుతిప్పలు పెట్టారు. తాజాగా అలాంటి చేదు అనుభవం రష్మికి ఎదురైంది. తాజాగా రష్మీ చిత్తూరులోని స్థానిక చర్చి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఈమె హాజరయ్యారు.
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రష్మీ వస్తుందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక రష్మీ రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆమె పై దూసుకు వచ్చారు. వారందరిని కంట్రోల్ చేయడానికి మాల్ సిబ్బంది విఫలమయ్యారు.
ఇలా అభిమానులందరూ తనపై దూసుకువస్తున్న అభిమానుల పట్ల ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో రష్మి అభిమానులకు సర్దిచెప్పి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…