Anchor Rashmi: నాగశౌర్య గత రెండు రోజుల క్రితం రోడ్డుపై కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక అబ్బాయి అమ్మాయిపై చేయి చేసుకోవడం చూశారు. దీంతో కారు దిగి వెంటనే ఆయన ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పించారు.ఇలా ఒక అమ్మాయిపై చేయి చేసుకోవడంతో నాగశౌర్య రియల్ హీరోగా మారి ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పించడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పై కొందరు నాగ శౌర్యను ప్రశంసిస్తూ కామెంట్లు చేయగా మరి కొందరు వాడి లవర్ వాడి ఇష్టం మధ్యలో మీకేంటి అంటూ కామెంట్లు చేశారు. అలాగే మరికొందరు ఈ గొడవ వల్ల ఆ అమ్మాయి ఫ్యామిలీకి మ్యాటర్ తెలిసిపోయింది అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ వీడియో పై నేటిజన్స్ స్పందించిన తీరును చూసి రష్మీ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాడి లవర్ వాడి ఇష్టమట అమ్మాయే ఇలా చెబితే ఏమంటాం… అసలు ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులలో ఉందో మీకు తెలుసా? ఇలాంటి కామెంట్లు చూస్తే సిగ్గేస్తోంది.మీరు మరొక ఆత్మహత్య జరగాలని భావిస్తున్నారా అంటూ ఈమె నేటిజన్ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇలా రష్మీ ఈ వీడియో పై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో నేటిజన్స్ రశ్మిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అసలు రోడ్లపై ఇలాంటి సంఘటనలు జరగడానికి మీ జబర్దస్త్ కారణం అంటూ కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఇలాంటి స్కిట్లు చేస్తే అక్కడ నవ్వుతావు… ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అంటూ రశ్మిని నేటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు ఏది ఏమైనా గత వారం రోజులుగా రష్మీ నేటిజన్ల చేతిలో దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…