Actor Sameer: బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా సుమ అడ్డా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రతి శనివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి నటుడు సమీర్ హేమ గిరిధర్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఎప్పటిలాగే వారితో పాటు కలిసి సందడి చేశారు. అయితే సుమ ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సమీర్ ను ఓ ప్రశ్న వేశారు. బాలయ్యతో కలిసి సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు వెళ్ళినప్పుడు ఏదో జరిగిందంట కదా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సమీర్ సమాధానం చెబుతూ లెజెండ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా అందరం ఓ ఈ వెంట్ కు వెళ్ళాం అయితే అక్కడ థియేటర్ గేట్ దగ్గరకు వెళ్లాలి అంటే బస్సు అక్కడి వరకు వెళ్లదు.కొంత దూరం దిగి అక్కడి వరకు నడిచి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
ఇక జనాలు చూస్తే థియేటర్ గేట్ వరకు చాలామంది ఉన్నారని ఆ జనాలను చూసి ఇంత మంది జనాలు ఉన్నారు అసలు మీరు ఎలా వెళ్తారు అంటూ బాలకృష్ణ గారిని అడగగా ఆయన మాత్రం చూస్తావా నేను ఎలా వెళ్తానో అంటూ బస్సు డోర్ తీసి ఒక్కసారిగా తోసేశారు అంటూ అప్పటి సంఘటన ఈ సందర్భంగా నటుడు సమీర్ గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సమీర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…