Anchor Shyamala : ఈ మధ్య బుల్లి తెర యాంకర్లు గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే అభిమానుల ఫాలోయింగ్ లోనూ సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విశేషాలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అయితే ఈ యూట్యూబ్ చానెల్స్ పుణ్యమా అని సెలబ్రిటీస్ కి ఉన్న కొత్త టాలెంట్స్ కూడా బయటపడుతున్నాయి.
మాస్ స్టెప్పులేసిన శ్యామల…..
ఇక బుల్లి తెర పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల. అటు టీవీ షో లలో బిజీ ఉంటూ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన శ్యామల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ తరువాత అటు యాంకర్ గాను ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్లతోను బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్న శ్యామల, తన యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువైంది.
ఇక తాజాగా సర్కారు వారి పాట సినిమాలోని మాస్ పాట మ.. మమ్మ .. మహేశా… పాటకు డాన్స్ వేసి అందరిని ఆకట్టుకుంది. టోటల్ బ్లాక్ డ్రెస్ లో మాస్ స్టెప్పులతో కుర్ర కారుకి పిచ్చెక్కిస్తోంది. శ్యామలకు పెళ్ళై ఒక కొడుకు ఉన్నా గ్లామర్ లో హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక ఆర్జీవి ఈ మధ్య ఒక ఈవెంట్లో శ్యామల అందం గురించి పొగిడేసాడు కూడా. ఇక హీరోయిన్లను మించిన అందంతో ఆకట్టుకుంటున్న శ్యామలను యూట్యూబ్ లో మిలియన్ కి పైగా మెంబర్స్ ఫాలో అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…