Featured

Sukumar : వీరిద్దరి మధ్య సీన్స్ హైలైట్ ఉంటాయట.. పుష్ప2 కోసం ఆ సినిమాల ట్రెండ్ ని ఫాలో అవుతున్న సుకుమార్…

Sukumar : సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈసినిమా లోని బన్నీ మానేరిజంని ఇప్పటికీ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకు అందరు అనుకరిస్తూనే వుంటారు. అంతలా ఈ సినిమా జనంలోకి దూసుకెళ్ళింది. ఇక నార్త్ లో అయితే ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు. ఎక్కువ ఆర్భాటం లేకుండా వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో టాలీవుడ్ సత్తా చూపింది పుష్ప. ఇక పుష్ప సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప2 మీద అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి. అయితే సుకుమార్ ఇప్పటికే పుష్ప2 సినిమాని పుష్పాకి మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆర్ఆర్ఆర్, కేజీఫ్ 2 సినిమాలు వచ్చాక పుష్ప 2 కూడా ఆరేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు సుకుమార్.

పుష్ప2 గురించి క్లారిటీ ఇచ్చిన సుకుమార్…..

పుష్పతో సినీ అభిమానులలో ఒక ట్రెండ్‌ క్రియేట్ చేసిన సుక్కు.. పార్ట్‌ 2కు మాత్రం ప్రస్తుత ట్రెండ్ అయిన పాన్‌ ఇండియా ట్రెండ్‌ని ఫాలో అవ్వాలనుకుంటున్నాడట. గతంలో వచ్చిన బాహుబలి సినిమాలోనూ, అలాగే రీసెంట్ గా వచ్చిన కేజీయఫ్‌-2లో హీరో కి విలన్‌ కి మధ్య వార్‌ని నెక్ట్స్‌ లెవల్‌లో చూపించారు దర్శకులు. ఈ రెండు సినిమాలు ముందు సినిమాలకి సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కావడం అందులోను ఇవి సువర్ హిట్ అవ్వడంతో సుకుమార ఇలా ప్లాన్ చేస్తున్నారట.

జులై నెల నుంచి పుష్ప2 షూట్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంని దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. సుకుమార్ ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్ ను మారేడుమిల్లి అడవుల్లోనే ఫిక్స్ చేసాడట. జనవరి నెలతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి, ఇంకో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు సమయం కేటాయించి, వచ్చే ఏడాది వేసవి లో పుష్ప2 విడుదల ప్లాన్ చేస్తున్నారు. పుష్ప2లో అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ మధ్య సీన్లు  సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని క్లారిటీ ఇచ్చాడు. పుష్ప1 కంటే పుష్ప2 ఇంకా బాగుంటుందనీ, తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సుకుమార్ తెలియజేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago