యాంకర్ శ్యామల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆమె తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు. షూటింగ్ సమయంలో కాస్త విశ్రాంతి దొరకడంతో అభిమానులు, నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వివిధ రకాల ప్రశ్నలను శ్యామలను అడిగారు. వాళ్లుకు ఏం సమాధానాలు చెప్పారు.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలు ఏంటి అనేవి ఏంటో తెలుసుకుందాం..
ఆమె బుల్లితెర ఫీమేల్ యాంకర్ లో ఒకరుగా ఉన్నారు. సినిమా ప్రమోషనల్ దగ్గర నుంచి వంట ప్రాగ్రాంలు, సీరియల్స్ లో ఆమె ఫేమస్ అయ్యారు. ఆమె బిగ్ బాస్ రెండో సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె ఫేమ్ విపరీతంగా పెరిగిపోయింది. సీజన్ 2 లో కూడా గ్రూప్ లు నడిచాయి. అందులో గీతామాధురి, శ్యామల, యాంకర్ దీప్తి గ్యాంగ్ ఉండగా.. మరో గ్యాంగ్ కౌశల్ ఉండేవారు.
అలా హౌస్ లో ఫుల్ జోష్ లో ఉండేవారు. ఇక ఈ మధ్య ఆమె భర్తపై వచ్చిన చిన్నపాటి ఆరోపణలతో ఆమె కాస్త క్రుంగిపోయినట్లు కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాగ్రాంలకు యాంకర్ చేసుకుంటూ వస్తున్నారు. తనకు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే.. సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయడమే కాదు.. ఆమె తన యూట్యూబ్ చానల్లో కూడా పోస్టు చేస్తుంది. ఇక ఇన్ స్టాగ్రాంలో శ్యామల తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది.
అందులో ఓ నెటిజన్ ఇలా ప్రశ్నించారు.. నీ మొదటి లవ్ ఎవరు..? తన భర్త యువరాజ్ ఫోటోను షేర్ చేస్తూ.. నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ అతనే అని చెప్పేసింది. మరో నెటిజన్ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడగ్గా.. వద్దు అన్నట్టుగా తల ఊపారు. ఇక మరో నెటిజన్ మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే.. నటిస్తారా.. అని అడగ్గా.. నో అని తల ఊపింది. ఇక ఇష్టమైన హీరో మహేశ్ బాబు అని.. మహేష్ బాబు ఫొటోను షేర్ చేశారు. ఇలా ఆమె అభిమానులతో కాసేపు సరదాగా సందడి చేశారు. ఈ క్వచ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…