బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు బిగ్బాస్. సీజన్ 4 లో కేవలం గ్లాస్ అవుతల నిలబడి మాట్లాడి వెళ్లారు. కారణం అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా అంలాంటి పరిస్థితి నెలకొంది.
అయితే ఈ సారి కరోనా వ్యాప్తి తగ్గడం.. అంతే కాకుండా హౌస్ లోకి వెళ్లేవారిని నాలుగు రోజుల ముందే కరోనా టెస్ట్ చేయించి.. క్వారంటైన్ చేసినట్లు సమాచారం. ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో హౌస్ అంతా ఇక ఫ్యామిలీ మెంబర్స్ తో గడపనున్నారు. అందుకే త్వరగా కెప్టెన్సీ టాస్క్ కూడా ముగించేశారు. బుధవారం, గురువారం, శుక్రవారం వరకు ఫ్యామిలీ మీటింగ్ ఎపిసోడ్లను టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం.
దీంతో ఆ మూడు రోజులు స్టార్ మా కు మంచి టీఆర్పీ వస్తుందని బిగ్బాస్ విశ్లేషకులు చెబుతున్నారు. హౌస్ లోకి ఏ కంటెస్టెంట్ కోసం ఏ ఫ్యామిలీ మెంబెర్స్ వస్తున్నారో తెలుసుకుందాం.. ఈ మీటింగ్ అనేది బిగ్ బాస్ నిర్వాహకులు చాలా స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ కోసం వల్ల అమ్మ ఉమ రాణి, గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా రాబోతున్నారని సమాచారం.
సన్నీ కోసం వాళ్ల అమ్మ కళావతి వస్తున్నారట. ఇక సిరి కోసం వాళ్ల అమ్మ మరియు తను దత్తత తీసుకున్న కుమారుడు హౌస్ లోకి రానున్నారని విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రియాంక సింగ్ కోసం వాళ్ల తల్లిదండ్రులు రాబోతున్నారట. మానస్ కోసం వాళ్ల అమ్మ పద్మ వస్తున్నారట. ఇక హౌస్ లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు భావోద్వేగంతో కూడిన సందడి చేయనున్నారు.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్‌ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…