బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కెప్టెన్సీ టాస్క్ అనేది చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది. ఇక్కడ జరిగిన చివరి కెప్టెన్సీ టాస్క్ లో ఇచ్చిన పేరు ‘అది నియంత మాటే శాసనం’. దీనిలో ఆ సింహాసనం పై కూర్చున్న వ్యక్తి గేమ్ లో చివరి స్థానంలో ఉన్న ఓ వ్యక్తిని కెప్టెన్ కాకుండా బయటకు పంపించేస్తాడు. ఇలా మొదట సింహాసనంపై కూర్చున్నది సిరి.
మొదట గేమ్ లో రవి మరియు సన్నీ చివరి స్థానంలో ఉంటారు. అందులో రవిని సేవ్ చేసి.. సన్నీని కెప్టెన్సీ టాస్క్ నుంచి పంపించేస్తుంది. ఇక తర్వాత సింహాసనంపై శ్రీరామ చంద్ర కూర్చుంటారు. వీళ్లకు ఇచ్చిన టాస్క్ లో చివరి స్థానంలో రవి, కాజల్ ఉంటారు.
దీనిలో శ్రీరామ చంద్ర- కాజల్ మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. చివరకు రవిని సేవ్ చేసి.. కాజల్ ను బయటకు పంపిస్తాడు శ్రీరామ చంద్ర. ఇక మూడో సారి సింహాసనంపై రవికి అవకాశం దొరుకుతుంది. అక్కడ ఇచ్చిన గేమ్ లో చివరి స్థానంలో షణ్ముఖ్, మానస్ ఉంటారు. అందులో షణ్ముఖ్ ను రవి సేవ్ చేసి.. మానస్ ను గేమ్ నుంచి పంపించేస్తాడు.
ఇలా మళ్లీ సింహాసంపై ప్రియాంక సింగ్ దక్కించుకుంటుంది. తర్వాత ఇచ్చిన గేమ్ లో చివరి స్థానాన్ని శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ నిలుస్తారు. అందులో షణ్ముఖ్ ను సేవ్ చేస్తుంది ప్రియాంక సింగ్. ఇక చివరకు కెప్టెన్సీ టాస్క్ లో మిగిలింది ప్రియాంక సింగ్, సిరి, రవి మరియు షణ్ముఖ్ ఉంటారు. దీనిలో షణ్ముఖ్ ను హౌస్ కాల్ ద్వారా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ ఎన్నికయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ దీంతో రెండో సారి హౌస్ లో కెప్టెన్ అవుతాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…