బుల్లితెర హాట్ యాంకర్‌గా పాపులర్ అయిన శ్రీముఖి మొదట వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే సరైన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు అద్భుతమైన స్టార్డమ్ తెచ్చుకుంది.బుల్లితెరపై తన గ్లామర్‌తో, చలాకి మాటలతో రచ్చ చేస్తూనే వీలైనప్పుడల్లా హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తు, తన అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా హాట్ బ్యూటీ శ్రీముఖి శేఖర్ మాస్టర్‌కి స్టేజ్‌పైనే ముద్దుల మీద ముద్దులు పెడుతూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.అసలు విషయం ఏమిటంటే. ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ నాలుగో సీజన్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.ఇందులో రెండో ఎపిసోడ్‌కి శేఖర్ మాస్టర్ ,శ్రీముఖి జంటగా వస్తున్నారట.
అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేయగా ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోమోలో శ్రీముఖి రెచ్చిపోయి శేఖర్ మాస్టర్ బుగ్గలపై ముద్దుల వర్షం కురుస్తుంది. శేఖర్ మాస్టర్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. అనంతరం శ్రీముఖి ఇది ఈ షోకి సంబంధించినది మాత్రమే కల్పితాలు మాత్రమే అని క్యాప్షన్ చెబుతూ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ అమ్మడు అంతటితో ఆగకుండా తన వయ్యారాలను చూపుతూ స్టేజ్ పైన శేఖర్ మాస్టర్ తో కలిసి రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలపేస్తే నేనికా అంటూ స్టెప్పులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. అలాగే శ్రీముఖి రెచ్చిపోయి బావా..బావ అంటూ ఓంకార్ ని ఆట పట్టిస్తు సాగే ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ప్రేక్షకులను ఉల్లాసపరుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…