Anchor Suma: బుల్లితెరపై గత రెండు దశాబ్దాల నుంచి మకుటం లేని మహారాణిగా బుల్లితెరను ఏలుతున్నటువంటి యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై క్యాష్ కార్యక్రమానికి మాత్రమే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సుమ నిత్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ అంటూ పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లతో బిజీగా గడుపుతున్నారు.
ఒక వైపు సినిమా ఈవెంట్లతో బిజీగా ఉండటమే కాకుండా, క్యాష్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రతి వారం ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి రావడంతో క్యాష్ కార్యక్రమం జాతీయస్థాయిలో చర్చలకు వచ్చింది. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ గడ్డం నవీన్, పొట్టి నరేష్, దొరబాబు, బుల్లెట్ భాస్కర్ వంటి వాళ్లు హాజరైనట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి వీరు రాగానే సుమ రూల్స్ గురించి మీకు తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన పని లేదు అని అంటుంది.వెంటనే నరేష్ ఏదైనా కొత్తగా ఉంటే చెప్పండి అని అనగా సుమా మాత్రం నువ్వే పాతగా అయిపోయావు కొత్తగా చెప్పడానికి ఇంకేం ఉంటాయి అంటూ పంచ్ వేసింది.
అనంతరం సుమ మాట్లాడుతూ నువ్వు చూడటానికి ఇంతే ఉన్న వయసు మాత్రం బాగా పెరుగుతుంది అంటూ నరేష్ పై పంచ్ వేయగా నరేష్ మాత్రం వయసు కాదు అనుభవం పెరుగుతోంది అంటూ షాక్ ఇచ్చాడు.అనంతరం ఒక టాస్క్ లో భాగంగా సుమ గబ్బర్ సింగ్ అవతారం ఎత్తారు.ఈ టాస్క్ లో భాగంగా నరేష్ ఏకంగా సుమను ఆంటీ అని పిలవడంతో సుమ ఒక్కసారిగా అతనిపై ఫైర్ అవుతూ ఎవడ్రా నీకు ఆంటీ అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పానంటూ తనపై మండిపడ్డారు. అయితే ఇదంతా కూడా టాస్క్ లో భాగమేనని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…