Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు.గత కొద్ది రోజుల క్రితం న్యూడ్ ఫోటోల వివాదంతో వార్తల్లో నిలిచిన ఈయన తాజాగా బెంగళూరులో జరిగిన సైమా వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలలో భాగంగా రణవీర్ సింగ్ 2021 హిందీ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా పలువురు విజేతలకు సైమా అవార్డును కూడా అందజేశారు.
ప్రతి ఏడాది జరిగే ఈ సైమా అవార్డు వేడుకలు ఈ ఏడాది కూడా బెంగళూరులో రెండు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వివిధ భాషల నుంచి పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వంటి సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కి ఈ వేడుకలలో చేదు అనుభవం ఎదురయింది. ఈ కార్యక్రమంలో రణవీర్ సింగ్ సందడి చేయగా పెద్ద ఎత్తున అభిమానులు ఈయనతో సెల్ఫీ దిగడం కోసం ఎగబడ్డారు. ఇలా ఒక్కసారిగా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడటంతో అతని బాడీగార్డ్స్ తనని రక్షించే సమయంలో పొరపాటున బాడీగార్డ్ చెయ్యి రణవీర్ చేతికి తగలడంతో ఒక్కసారిగా ఆయన కంగుతున్నారు.
ఇలా బాడీగార్డ్ చేయి అతనికి తగలడంతోహీరో మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా బాడీగార్డ్ తన చెంపకు కొట్టగానే రణవీర్ తన చేతిని చంపకు అడ్డుపెట్టుకొని అనంతరం జరిగిన విషయం తెలుసుకున్న హీరో పొరపాటుగా జరిగిందని గ్రహించి తిరిగి నవ్వుతూ అభిమానులతో కలిసి సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…