Anchor Suma: ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమం హైలెట్ చేయడం కోసం ప్రోమోలు ఎంతో విభిన్నమైన రీతిలో కట్ చేసి విడుదల చేస్తున్నారు. ఇలా ప్రోమోలు కట్ చేయడం వల్ల నిజంగానే ఏదో జరిగిపోతుందని అభిమానులు తెగ కంగారు పడుతుంటారు. అయితే చివరికి అదంతా అబద్ధమని తెలియడంతో నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉండడం మనం చూస్తున్నాము.
ఇలా ఎపిసోడ్ హైలైట్ కోసం ప్రోమోలలో జిమ్మిక్కులు చేయడం అవి అబద్ధమని తెలియడంతో సదరు యాంకర్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ కి గురవుతున్నారు. ప్రస్తుతం యాంకర్ సుమ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈమె కూడా న్యూ ఇయర్ సందర్భంగా వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమంలో తాను మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు తనని ఎంతో ఆదరించారని తాను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు కారణం తెలుగు ఆడియన్స్ అని చెప్పారు.
ఇలా తనని ఎంతో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఈమె కొంత కాలం పాటు తన యాంకరింగ్ కు విరామం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పారు.దీంతో ఇది కాస్త వైరల్ కావడంతో ఎంతోమంది నిజంగానే సుమ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు పెద్ద ఎత్తున కథనాలు వెలబడ్డాయి దీంతో సుమ మరోసారి ఈ వీడియో పై స్పందించి అసలు విషయం చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా ఈ ప్రోమో పై స్పందించిన సుమ ప్రోమో అంతా ఉత్తుత్తే అని చెప్పేసి.. వీడియో డిలేట్ చేసింది. అయితే.. అప్పటికే కొందరు ఈ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాంకరింగ్ మానేస్తున్నానని చెప్పడం ఎందుకు అంత ఉత్తుత్తే అని చెప్పడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున సుమను ట్రోల్ చేస్తున్నారు.జనాలలో సుమ కార్యక్రమాలు అంటే ఒక క్రేజ్ ఉంది ఇలాంటి చెత్త ప్రోమోలతో ఆ క్రేజ్ కాస్త పోగొట్టుకోకు అంటూ మండిపడుతున్నారు.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…