Balakrishna -Prabhas: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం సీజన్ 2 ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సీజన్లో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రానున్నారని తెలియడంతో ఆ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ప్రభాస్ తో ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. అయితే ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల కానుందని ఆహా అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే తాజాగా మరొక ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ మొదటి భాగం డిసెంబర్ 30వ తేదీ ప్రసారం కానున్నట్లు ఆహా అధికారకంగా వెల్లడించింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ తో కలిసి అన్ స్టాపబుల్ హంగామా చేశారు.ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ ని ప్రశ్నిస్తూ నిన్ను మీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఏమని పిలుస్తారని అడగగా డార్లింగ్ అని పిలుస్తారు.మరి అమ్మాయిలు ఏమని పిలుస్తారని అనడంతో అది ఏదో ఈ మధ్యకాలంలో అన్ని మర్చిపోతున్నాను సార్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
నేను కూడా నీ మాయలో పడిపోయాను. డార్లింగ్ అని పిలిస్తే దయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి అంటూ బాలయ్య నవ్వులు పూయించారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా బాలకృష్ణ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా రామ్ చరణ్ తో ఆడియో కాల్ ద్వారా బాలకృష్ణ మాట్లాడారు.
ఈ ఫోన్ కాల్ లో భాగంగా సంక్రాంతికి ముందు నా సినిమా చూడు ఆ తర్వాత మీ నాన్నగారు సినిమా చూడు అంటూ బాలకృష్ణ సరదాగా రామ్ చరణ్ ను బెదిరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో గోపిచంద్ కూడా పాల్గొనగా 2008వ సంవత్సరంలో ఒక హీరోయిన్ తో జరిగిన గొడవ గురించి కూడా ప్రస్తావించారు. మొత్తానికి ఈ ప్రోమో ఎంతో సరదాగా సాగిపోయింది. ఇక ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…