Movie News

Waltair Veerayya: షూటింగ్ మొదటి రోజే కొడుకు చనిపోయాడని ఫోన్… విషాద ఘటన గుర్తు చేసుకున్న వాల్తేరు వీరయ్య విలన్

Waltair Veerayya: ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలలో విలన్లకు అధిక ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఈ విధంగా ఇండస్ట్రీలో విలన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో రెమో అలియాస్ రహీం ఒకరు.తాజాగా ఈయన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలిపారు.

ఈ సందర్భంగా రహీమ్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటినుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం అయితే రవితేజ హీరోగా నటిస్తున్న వెంకీ సినిమా షూటింగ్ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ చూస్తూ అక్కడే నిలబడ్డాను నన్ను గమనించిన హీరో టెర్రరిస్ట్రా ?అని అడిగారు. తనకు సినిమాలంటే ఇష్టమని చెప్పడంతో సినిమాలలోకి రావాలంటే నటించడం రావాలి అలాగే బాడీ ఫిట్నెస్ కూడా మైంటైన్ చేయాలి అని చెప్పారు.

అలా చెప్పేసరికి నేను అక్కడి నుంచి ఏడుస్తూ వెళుతుండగా రవితేజ గారు పిలిచి బాగా బాడీ మెయింటైన్ చేసి ఈ నెంబర్ కి ఫోన్ చెయ్ అని తన నెంబర్ ఇచ్చారు. ఇలా ఆ నెంబర్ వల్ల నేను ఇక్కడ ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. ఇండస్ట్రీలో వరుసగా సినిమా అవకాశాలు అందుకొని సుమారు100 సినిమాలకు పైగా విలన్ పాత్రలలో చేశానని తెలిపారు. తాజాగా చిరంజీవి గారి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఈయన వెల్లడించారు.

వాల్తేరు వీరయ్య సినిమాలో తాను విలన్ గా నటించానని అయితే ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు తాను ఎంతో సంతోషంగా షూటింగ్ లొకేషన్లోకి వెళ్లాను. అయితే ఆ రోజే నా జీవితంలో మర్చిపోలేని విషాద ఘటన చోటు చేసుకుందని తెలిపారు.ఈ సినిమా షూటింగుకు ముందు తన భార్య కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారు. తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Waltair Veerayya: జీవితంలో మర్చిపోలేని విషాద ఘటన…


అయితే అదే రోజే షూటింగ్ కు రావాలని ఫోన్ కాల్ వచ్చింది. వెళ్లకపోతే ఈ సినిమా అవకాశం కోల్పోతుందని వారు హాస్పిటల్లో ఉండగానే షూటింగ్ కి వెళ్లాను.ఇలా షూటింగ్లో పాల్గొని కొన్ని డైలాగ్స్ చెప్పగానే ఇంటి నుంచి నా కుమారుడు చనిపోయాడని ఫోన్ కాల్ వచ్చింది.అక్కడి నుంచి వెళ్ళిపోతే తిరిగి అవకాశం కోల్పోతానేమోనని సాయంత్రం ఐదు గంటల వరకు షూటింగ్ లో పాల్గొని ఇంటికి వెళ్లానని ఆ విషాద ఘటన గురించి తలుచుకొని రహీమ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago