Akshara Singh: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు లేదా క్రీడాకారులకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు విపరీతమైన అభిమానులను సంపాదించుకుంటారు. ఇలా ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి సెలబ్రిటీలు సాధారణంగా బయటకు రావడానికి ఇష్టత చూపరు ఒకవేళ వచ్చిన పూర్తి సెక్యూరిటీతో బయటకు వస్తారు.
ఇక మరికొంతమంది స్వేచ్ఛగా షాపింగ్ చేసుకోవడానికి లేదా వారికి ఇష్టమైన జీవితాన్ని గడపడం కోసం సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళుతుంటారు. ఇక పొరపాటున సెక్యూరిటీ లేకుండా బయటకు గనుక వస్తే ఆ సెలబ్రిటీల కష్టాలు వర్ణాతీతం. తాజాగా ఇలాంటి కష్టాల ఊబిలో చిక్కుకున్నారు భోజ్ పురి నటి అక్షరాసింగ్.
ఈమె ప్రస్తుతం బీహార్ లో జరుగుతున్నటువంటి బేథియా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లింది .సెక్యూరిటీ లేకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లగా అక్కడ నిర్వాహకులు కూడా తనకు పెద్దగా సెక్యూరిటీ కల్పించలేకపోయారు. దీంతో తమ అభిమాన నటి జనాలలోకి రావడంతో ఒక్కసారిగా అభిమానులు సెల్ఫీలు తీసుకోవడం కోసం ఎగబడ్డారు.
ఇలా అభిమానులందరూ తనని చుట్టుముట్టడంతో ఒక్క సారిగా అక్షర సింగ్ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా స్కూటీ పై అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇలా ఈమె స్కూటీపై వెళ్తున్నప్పటికీ అభిమానులు మాత్రం తన స్కూటీ వెంట పరుగులు పెట్టారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…