Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమా ఈవెంట్లు సక్సెస్మెంట్ కార్యక్రమాలు ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు అంటూ సుమా చాలా బిజీగా గడుపుతున్నారు.
ఇక ఇండస్ట్రీలో సుమకు ఎంతటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. పెద్ద హీరోల సినిమాల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాల వరకు ఏ కార్యక్రమం జరిగిన తప్పనిసరిగా సుమా ఉండాల్సిందే. కొంతమంది సుమా డేట్స్ ముందుగానే బుక్ చేసుకుని ఆమెను తమ కార్యక్రమాలకు యాంకర్ గా తీసుకుంటున్నారు.
ఇలా ఇండస్ట్రీలో క్రేజీ యాంకర్ గా దూసుకుపోతున్న సుమ రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లక్ష నుంచి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకొని సుమ ప్రస్తుతం ఏకంగా రెమ్యూనరేషన్ డబల్ చేసిందని, ఒక్కో ఈవెంట్ కు దాదాపు 3 లక్షల వరకు చార్జ్ చేస్తుందని సమాచారం.
ఇలా ఈమె బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ భారీగా ఈమె అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తూ తనని తమ సినిమా ఈవెంట్లకు యాంకర్ గా నియమించుకోవడం గమనార్హం. ఇక సుమ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలను పూర్తిగా తగ్గించారు. ఇలా సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్నారు.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…