Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లో అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.గత కొంతకాలంగా మయోసైటిసిస్ కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ప్రస్తుతం తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో సమంత వెంట పలు కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ తిరుగుతున్నారు.
ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి సమంత తాజాగా ఈమె చేసిన పని కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒక సెలబ్రిటీ ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు అంటే అది జనాలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ఇబ్బందులను తీసుకువచ్చేదే ఉండకూడదు. కానీ తాజాగా సమంత పెప్సీ యాడ్ చేశారు.
ఇలా ఈ ప్రమోషన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ సమంత ఈ వీడియో పై స్పందిస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సంపాదించిన డబ్బు సరిపోలేదా డబ్బు కోసం తిరిగి ఇలా ఆరోగ్యానికి హానికరం చేసే వాటిని కూడా ప్రమోట్ చేయాలా అంటూ తీవ్రస్థాయిలో తనని ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే సమంత అభిమానులు మాత్రం సమంత మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…