NTR: జూనియర్ ఎన్టీఆర్ ఈయన క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా RRR సినిమా ద్వారా ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ సినిమా ద్వారా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఇక ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా స్టార్ గా సక్సెస్ సాధించారు.
ఇకపోతే ఈయన సినిమా షూటింగ్ లోకేషన్ లో కనుక ఉంటే అందరితో ఎంతో సరదాగా మాట్లాడటమే కాకుండా సహనటీనటులకు ఎంతో గౌరవం మర్యాదలు కూడా ఇస్తారని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఈయన మంచితనం గురించి ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తెలియచేశారు.
ఇకపోతే ఎన్టీఆర్ ఒక హీరోయిన్ పట్ల వ్యవహరించిన తీరుకు ఏకంగా ఆయన ఆ హీరోయిన్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారట. ఇంతకీ హీరోయిన్ ఎవరు తనకు క్షమాపణలు చెప్పాల్సినంత తప్పు ఎన్టీఆర్ ఏం చేశారనే విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, ప్రియమణి, మమత మోహన్ దాస్ హీరో హీరోయిన్లుగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమాలోని ఓలమ్మి తిక్క రేగిందా అనే పాట కూడా అదే స్థాయిలో హిట్ అయింది.అయితే ఈ పాటలో ఎన్టీఆర్ డైరెక్టర్ చెప్పడంతోనే మమత మోహన్ దాస్ బ్యాక్ పై భారీగా కొట్టారు. అయితే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత తాను అలా చేయడం పట్ల మమతా మోహన్ దాస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉంటుందని ఫోన్ చేసి మరి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…