బుల్లితెరపై ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి.ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకొని ఐదవ సీజన్ ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కరోనా కారణం వల్ల వాయిదాపడిన ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారని,బిగ్ బాస్ కంటెస్టెంట్ లో అందరినీ 20 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం హౌస్ లోన్ కి పంపిస్తారని తెలుస్తుంది. ఇది వరకు సీజన్ల మాదిరి కాకుండా ఈసారి బిగ్ బాస్ లోగోలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది వరకు బిగ్ బాస్ కన్ను నలుపు రంగులో ఉండేది. ఇప్పుడిది గోల్డ్ కలర్ లోకి మారిపోయింది.ఇక కంటిలోపల పజిల్ లాంటి ఒక పద్మవ్యూహాన్ని కూడా ఏర్పాటు చేయడంతో ఈసారి సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుందని అర్థమవుతుంది.
ఇక ఈ సీజన్లో కి కంటెస్టెంట్ గా వీళ్ళ అంటూ కొందరి కంటెస్టెంట్ పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. అలాంటి వారిలో యాంకర్స్, యూట్యూబ్, వంటి వారు అధికంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ లిస్టులో యాంకర్ వర్షిణి కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వర్షిని కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న “కామెడీ స్టార్స్”ఈ కార్యక్రమానికి యాంకర్ గా వర్షిణికి బదులు శ్రీముఖి రావడంతో అందరికీ అనుమానాలు తలెత్తుతున్నాయి.
బిగ్ బాస్ ఆఫర్ రావడంతోనే వర్షిణికి కామెడీ స్టార్స్ కు గుడ్ బై చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ కోస కాదు వర్షిణికి సినిమా ఆఫర్స్ రావడం వల్ల కామెడీ స్టార్స్ నుంచి తప్పుకుంది అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…