Categories: FeaturedMovie News

Anchor Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియకి మాతృవియోగం… ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన విష్ణు ప్రియ!

Anchor Vishnu Priya: యూట్యూబర్ గా,బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాంకర్ విష్ణు ప్రియ తల్లి నేడు తుది శ్వాస విడిచారు.ఇలా విష్ణు ప్రియ తల్లి మరణించారనే వార్తను విష్ణు ప్రియ స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా తన తల్లి మరణ వార్త గురించి తెలియజేస్తూ తన తల్లి పట్ల ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే విష్ణు ప్రియ తన తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ మై డియర్ అమ్మ ఇన్ని రోజులపాటు నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను.ప్రస్తుతం నువ్వు ఈ అనంత లోకంలో కలిసిపోయిన ప్రతిచోట నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు.

నా జీవితం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అమ్మా. రెస్ట్ ఇన్ పీస్ అమ్మ అంటూ విష్ణు ప్రియ తన తల్లి మరణం పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా విష్ణు ప్రియ తల్లి మరణించారనే వార్త తెలియగానే పలువురు బుల్లితెర యాంకర్లు, బుల్లితెర నటీనటులు విష్ణు ప్రియ తల్లి మరణానికి సంతాపం ప్రకటిస్తూ తనకు ధైర్యం చెబుతున్నారు.

Anchor Vishnu Priya: విష్ణు ప్రియ.. రీతూ ఇంట విషాదాలు…

ఇకపోతే విష్ణు ప్రియ రీతు చౌదరి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయితే కేవలం కొన్ని రోజుల వ్యవధి కాలంలోనే విష్ణు ప్రియ తల్లి రీతు చౌదరి తండ్రి ఇద్దరు కూడా మరణించారు. ఇలా ఇద్దరి స్నేహితుల ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో పలువురు వీరిద్దరినీ ఓదారుస్తూ వీరికి ధైర్యం చెబుతున్నారు.అయితే గత రెండు రోజుల క్రితం ఈ ఇద్దరు స్నేహితులు మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లి ఎంతో ఎంజాయ్ చేసి వచ్చారు. అయితే ఈ వెకేషన్ పూర్తికాగానే వీరి ఇంట ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago