Haripriya: ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు వరుసగా తాము ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది తమ వివాహాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న కేజీఎఫ్ నటుడు వశిష్ట సింహ పిల్ల జమిందార్ హీరోయిన్ హరిప్రియ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.
ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి వశిష్ట సింహం హరిప్రియ పలు తెలుగు కన్నడ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తపడ్డారు.ఇక ఇద్దరు కూడా తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు సైతం వీరి ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇలా పెద్దల అంగీకారంతో ఈ జంటగత ఏడాది డిసెంబర్ నెలలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలోనే జనవరి 26వ తేదీ ఈ దంపతులు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలావీరి పెళ్లికి పెద్ద ఎత్తున సినీ సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోని వీరి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెలబ్రిటీలు అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక వివాహం తర్వాత నేడు బెంగళూరులో వీరు రిసెప్షన్ ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ రిసెప్షన్ కి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఇలా వశిష్ట సింహం హరిప్రియ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వీరి వివాహ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…