ఏపీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 31 ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదలైన నోటిఫికేషన్ లో డీఈఓ, హౌజ్‌కీపర్, లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు నెల్లూరులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 2020 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హతలో మార్పులు ఉన్నాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ, పీజీడీసీఏ వరకు ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో అర్హత ఉంది. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం బట్టి వేతనం లభిస్తుంది. ఈ నెల 5వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…