Categories: FeaturedMovie News

ఒసేయ్ ఉమా.. చిల్లరదానా అంటూ రెచ్చిపోయిన అనీ మాస్టర్

బిగ్ బాస్ రియాల్టీ షో వేరే లెవల్లోకి వెళ్లి పోతోంది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ.. తిట్ల పురాణాన్ని లంకించుకున్నారు. రెండోవారం నామినేషన్ ప్రక్రియలో నటి ఉమ మాట్లాడిన మాటలకు ఇంట్లో వాళ్లు ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు. కానీ రాను రాను ఆ హౌస్ లో ప్రతీ ఒక్కరి నోటి నుంచి బూతులే వినిపిస్తున్నాయి.

తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో అది స్పష్టంగా అర్థం అవుతోంది. కెప్టెన్సీ టాస్క్ కోసం పిజికల్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. అప్పటి నుంచి హౌస్ లో యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఎవరిపై ఎవరు.. ఏ మాట వదులుతారోనని ఇంటి ముందు టీవీల ముందు కూర్చున్న ఫ్యామిలీలు భయపడి పోతున్నారు. దీనిలోకి అనీ మాస్టర్ కూడా చేరిపోయింది. టాస్క్ లో భాగంగా ఉమాను ‘ఒసేయ్’ అంటూ సంభోదించింది.

‘ఒసేయ్ ఉమా చింపుతావా’ అంటూ అనీ అనగా.. మీరు మమ్మల్ని కొడితే.. చింపుతా అంటూ ఘాటుగా సమాధానం ఇస్తుంది ఉమ. తర్వాత ఆమె ఉమాను ‘సిగ్గులేదా నీకు తూ’ అంటూ అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఉమ కూడా ఆమెను తిట్టుకుంటూ.. తూ అంటూ చెప్పింది. నీదంతా చిల్లర వేషాలు అంటూ అనీ అంటే.. అవును నేను చిల్లరే.. నువ్వు పెద్ద క్లాస్ మరి అంటూ ఉమ సమాధానం ఇస్తుంది.

తర్వాత నా మీదకు వస్తే.. కాలుతో తంతా అంటూ శ్వేతకు అవతలి టీం సభ్యుల్లో ఒకరు హెచ్చరించగా.. దానికి శ్వేత ఘాటుగానే సమాధానం చెప్పారు. కాలుతో తన్నించుకోవడానికి బిగ్ బాస్ షోకి రాలేదు అంటూ కెమెరాకు చెబుతుంది శ్వేత. దీనికి ఎలా శుభం కార్డు పడుతుంది..? అంటూ ఇన్ స్టా లో ఈ వీడియోను స్టార్ మా పోస్ట్ చేసింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

8 minutes ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

19 minutes ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

34 minutes ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

47 minutes ago

“దేశంలో ఎక్కడా లేని శివలింగం.. తిరుపతి సమీపంలోనే అరుదైన అద్భుతం!”

తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…

58 minutes ago

“తమిళ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్?.. స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్!”

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…

1 hour ago