Anil Raavipudi : అనిల్ రావిపూడి… శౌర్యం, శంఖం, మసాలా, కందిరీగ, దరువు, ఆగడు వంటి చిత్రాలకి సహాయ దర్శకుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టి, కళ్యాణ్ రామ్ హీరో గా వచ్చిన పటాస్ చిత్రం తో దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్తానాన్ని ప్రారంభించాడు. తరువాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు మీకెవ్వరు, ఎఫ్2 వంటి వరుస చిత్రాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. అనిల్ రావిపూడి చేసిన అన్ని సినిమాలు విజయాన్ని సాధించడం విశేషం. అయితే తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్2 కి సీక్వెల్ గా ఎఫ్3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మే 27 న సినిమా విడుదల ఉండటంతో అనిల్ రావిపూడి చిత్ర ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. పలు టీవీ ప్రోగ్రాంలలోనూ, ఇంటర్వ్యూలలోను చురకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బిత్తిరి సత్తితో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ తన కాలేజీ డేస్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్పారు.
భార్య పక్కనే ఉండగా వేరొక అమ్మాయిని చూసేవాడిని…..
అనిల్ రావిపూడి తన భార్య భార్గవి ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్న సంగతి ఇంతకు ముందు చాలా సందర్భాలలో చెప్పారు . అయితే అనిల్ కాలేజీలో చదుకునేటప్పుడు తన భార్యని కాకుండా తన స్నేహితులతో కలిసి వేరే అమ్మాయికి సైట్ కొట్టేవాడట. కానీ ఆ అమ్మాయి వీళ్లను పట్టించుకోలేదట. ఆ సమయంలో అనిల్ రావిపూడి భార్య అదే బ్యాచ్లో ఉండేదట, తనకు కూడా ఈ విషయం తెలుసట.
కానీ ట్విస్ట్ ఏంటంటే ఫైనల్ గా ఆ అమ్మాయి బ్యాచ్ లో ఉన్న మరో అమ్మాయిని అనిల్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెనే భార్గవి. ఈ విషయాల గురించి తెలుసు కాబట్టి కాలేజీ రోజుల్లో నన్ను కాకుండా నువ్వు వేరే అమ్మాయిని చూసేవాడివి అంటూ అప్పుడప్పుడు దెప్పిపొడుస్తుంటుంది, అని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాలేజీ డేస్ లోని అనుభవాలని పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…