Kirak RP: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ.. ఫోటో వైరల్!
Kirak RP: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ లలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుని తన అద్భుతమైన కామెడీ ద్వారా వివిధ రకాల స్కిట్ లతో ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన కిరాక్ ఆర్పీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక ఈ మధ్య కాలంలో పూర్తిగా బుల్లి తెరకు దూరమైన
కిరాక్ ఆర్పీ తాజాగా తన నిశ్చితార్థం ఘనంగా జరుపుకునే అందరికీ షాక్ ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్ చేసిన కిరాక్ ఆర్పీ తనకు కాబోయే భార్య ఫోటోని కూడా చూపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాను ప్రేమించిన లక్ష్మి అనే అమ్మాయితో ఘనంగా నిశ్చితార్థం జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కిరాక్ ఆర్పీ నిశ్చితార్థానికి పలువురు జబర్దస్త్ కమెడియన్స్ అలాగే ఆయన సన్నిహితులు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్థానికి ధనాధన్ ధన్ రాజు కుటుంబ సమేతంగా హాజరయ్యారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకపోతే త్వరలోనే కిరాక్ ఆర్పీ మంచి ముహూర్తం చూసుకుని తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ఈ క్రమంలోనే తన పెళ్లి పనుల నిమిత్తం ఈయన గత కొంత కాలం నుంచి బుల్లితెరకు దూరం అయ్యారని తెలుస్తోంది. ఇకపోతే కిరాక్ ఆర్పీ త్వరలోనే ఒక డెబ్యూ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నా కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారనున్నారు.అదేవిధంగా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…