Actress Rajasri Nair: రాజశ్రీ నాయర్ పలు తెలుగు తమిళ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశ్రీ నాయర్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలో నటించడం ఇష్టం ఉండదని ఒక సీరియల్లో నెగిటివ్ పాత్రలో చేసినపుడు తరువాత సీరియల్లో పాజిటివ్ పాత్రలో నటిస్తానని తెలియచేసారు. ఇక నెగిటివ్ పాత్రలో నటించినప్పుడు చూడగానే విలన్ రూపం ఉండేలా తాను ఎప్పుడు మేకప్ వేసుకోనని, చాలా సింపుల్ గా మేకప్ ఉన్నప్పటికీ నా మైండ్ లో మాత్రం చాలా నెగటివ్ ఆలోచనలు ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈమె మాట్లాడుతూ మేఘసందేశం సినిమా షూటింగ్లో ఒక సీన్ చేయడం కోసం తాను 26 టేకులు తీసుకున్నానని తెలిపారు. అసలే సాయంత్రం అవుతుంది అందరూ కూడా ప్యాకప్ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో నేను ఆ సీన్ కంప్లీట్ చేస్తే త్వరగా వెళ్ళిపోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఆ సన్నివేశం ఏకంగా 26 టేకులు తీసుకునే సరికి అందరూ నా వైపు అదోలా చూశారని రాజశ్రీ వెల్లడించారు.
ఈ క్రమంలోనే తనతో పాటు నటించిన సహ నటుడు రావు రమేష్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. రావు రమేష్ తో కలిసి తాను సుమారు ఐదు చిత్రాల వరకు నటించానని, ఆయన సెట్లో ఎల్లప్పుడు ఎంతో రెస్పెక్ట్ గా మాట్లాడతారని, తను ఒక అద్భుతమైన నటుడని ఈమె తెలిపారు. అది ఒక కామెడీ సీన్ అయినా లేదా ఒక విలన్ పాత్రలోనైనా, ఒక తండ్రి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారని, ఆయనలో గొప్ప నటుడు ఉన్నారంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…