Anil Ravipudi: మరీ మీకు సెపరేట్ గా అవసరమా బ్రహ్మాజీ గారు…. వైరల్ అవుతున్న అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి బ్రహ్మాజీ మధ్య ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో బ్రహ్మజీ లేకుండా ఏ సినిమాలు రావడం లేదు అంతేకాకుండా కొత్త డైరెక్టర్లు బ్రహ్మజీతో సినిమా చేస్తే మంచి సక్సెస్ అవుతాయని కూడా సెంటిమెంట్ ఉంది. ఈ క్రమంలోనే బ్రహ్మాజీ అనిల్ రావిపూడి సినిమాలో కూడా నటిస్తున్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

బ్రహ్మాజీ వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. బ్రహ్మాజీ మీద అప్పుడప్పుడూ ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. తాజాగా బ్రహ్మాజీ ఓ ట్వీట్ వేశాడు. తాను NBK 108 సెట్‌లో అడుగు పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ గారు మీరు కూడా ఆన్ బోర్డ్ ఏ.. మాకు వెల్కమ్ లేదా?.. నా పాన్ ఇండియన్ ఫ్యాన్స్‌కు ఇదే నా గ్లింప్స్ అంటూ ట్వీట్‌తో పాటుగా వీడియోను షేర్ చేశాడు. ఇక ఈ వీడియోలో బ్రహ్మాజీ కారు దిగి అనిల్ రావిపూడి కాళ్ళపై పడ్డారు.

Anil Ravipudi: అనిల్ రావిపూడి కాళ్లు మొక్కిన బ్రహ్మాజీ…

దీంతో అనిల్ రావిపూడి ఒక్కసారిగా షాక్ అవుతాయో మీరు నాకన్న పెద్ద వాళ్ళు అని చెప్పగా మీ షూ ఏ బ్రాండ్ అని చూస్తున్నాను అంటూ బ్రహ్మాజీ కామెడీ చేశారు. ఇక బ్రహ్మాజీ చేసిన ఈ ట్వీట్ కు అనిల్ రావిపూడి రిప్లై ఇస్తూ ఏ స్క్రిప్ట్ అయినా ఆఫీస్ బోర్డు మీద ఉన్నపుడే మీరు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ లో వుంటారు.. మళ్ళీ మీకు సెపరేట్ గా ఆన్ బోర్డ్‌లు అవసరమా బ్రహ్మాజీ గారు అని ట్వీట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.