Aadipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన జూన్ 16వ తేదీ ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కన్నా ట్రైలర్ 100 రేట్లు మెరుగ్గా ఉందంటూ పలువురు ట్రైలర్ వీడియో పై స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదని సమాచారం. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ఎంపిక చేసుకున్నారట ఇందులో హృతిక్ రాముడి పాత్రలో నటించగా ప్రభాస్ ను రావణాసురుడి పాత్రలో అనుకున్నారట.
హృతిక్ రోషన్ కి కథ మొత్తం వివరించగా ఈయన సినిమా కథలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని సూచించారట అయితే అది నచ్చినటువంటి డైరెక్టర్ ఈ సినిమాని హృతిక్ రోషన్ తో చేయడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. ఇలా హృతిక్ రోషన్ ను వద్దనుకున్న ఓమ్ రౌత్ ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ ని అలాగే రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటి కృతిసనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదలైన సమయంలో భారీగా ట్రోల్స్ రావడంతో ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేసి జూన్ 16వ తేదీ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరి విడుదలకు ముందే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…