Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కామెడీ షో ద్వారా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ వరుస బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఆకట్టుకున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా ఈయన సందడి చేశారు.
ఇలా వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుదీర్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ప్రస్తుతం సుధీర్ వరుస సినిమాలలోనటిస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు ఈయన మూడు సినిమాలలో నటించగా ఇందులో గాలోడు అనే సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సుధీర్ తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు.
ఇక సుధీర్ తదుపరి సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా ఈ సినిమాలో సుధీర్ సరసన నటించే హీరోయిన్ గురించి మేకర్స్ అధికారక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే సుధీర్ నాలుగవ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే బ్యాచిలర్ అనే డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హాట్ బ్యూటీ దివ్యభారతి.
ఇలా ఈ హీరోయిన్ సుడిగాలి సుదీర్ నాలుగవ సినిమాలో నటించబోతున్నారని అధికారక ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాలుగవ సినిమాకి ఈ హాట్ బ్యూటీతో సుధీర్ రొమాన్స్ చేయబోతున్నారు అంటే సినిమాలో కూడా ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో అర్థం అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక సుధీర్ సరసన నటించే హీరోయిన్ గురించి మేకర్ రివీల్ చేస్తూ అధికారక పోస్టర్ కూడా విడుదల చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…