Ankitha: అంకిత తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు. ఇక ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో చీమ చీమ అనే పాట ద్వారా ఎంతో మంచి ఫేమస్ అయ్యారు. ఈ పాట ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు పొందలేదు.
ఇలా సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈమె 2009వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు. ఇలా విదేశాలలో ఉంటున్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అంకిత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడితే బాలకృష్ణతో నటించిన విజయేంద్ర వర్మ సినిమా సక్సెస్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపారు.ఇక ఇండస్ట్రీలో నాకు ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈమె వారిని గుర్తు చేసుకున్నారు.
ఆర్తి అగర్వాల్ చాలా క్లోజ్ అని పెళ్లి తర్వాత ఇక్కడే ఉండేది ఇద్దరం పలుసార్లు కలిసాము.ఇక ఉదయ్ కిరణ్ తో కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని అయితే వీరిద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు అంటూ వీరిని తలుచుకొని అంకిత ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ తలుచుకుంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…