Categories: FeaturedMovie News

Sravana Bhargavi: శ్రావణ భార్గవితో పాటు ఆ పాటలపై చర్యలకు సిద్ధమైన అన్నమయ్య వంశీకులు.. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో?

Sravana Bhargavi: శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో భక్తితో అన్నమయ్య వంశీకులు పాడిన కీర్తనల గురించి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అన్నమయ్య కీర్తనలను ఎన్నో సినిమాలలో పాటలుగా చిత్రీకరించారు. అయితే అన్నమయ్య కీర్తనలలో ఒకటైన ఒక పరి ఒక పరి అని కీర్తనను నటి శ్రావణ భార్గవి పాడటమే కాకుండా ఈ పాటలో ఆమె నటించడం పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అయ్యింది.

ఈ పాటను పాడుతూ ఇందులో ఆమె పడుకొని పుస్తకాలు చదవడం లడ్డూలు జంతికలు తినడం అలాగే తన కాళ్లు ఊపుతూ ఎంతో శృంగార భరితంగా నటించింది అంటూ పెద్ద ఎత్తున తనపై విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ చేస్తూ టీటీడీ దృష్టికి తీసుకెళ్లి వెంటనే తనపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య వంశస్థులు ఈ వీడియో పై స్పందించారు.

ఈ క్రమంలోనే అన్నమయ్య వంశీకులు ఈ పాటను శ్రావణ భార్గవి డిలీట్ చేయాలని కోరగా ఆమె ఈ పాటలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని అందుకే తాను డిలీట్ చేయనని తెలిపారు.ఈ క్రమంలోనే అన్నమయ్య వంశస్థులు ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకోవడమే కాకుండా,శ్రీవారి పై భక్తితో రాసిన ఈ అన్నమయ్య కీర్తనలను పలు సినిమాలలో కూడా చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలపై కూడా అన్నమయ్య వంశస్థులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పలు సినిమాలలో అన్నమయ్య కీర్తనలతో పాటు, శ్రావణ భార్గవి చేసిన ఈ వీడియో పై కూడా అన్నమయ్య వంశస్థులు లీగల్ గా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ అధికారులతో సమావేశమై ఈ విషయం గురించి అన్నమయ్య వంశస్థులు చర్చలు జరుపనున్నట్లు సమాచారం. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే శ్రావణ భార్గవి మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని అలాంటప్పుడు ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేయాలి అంటూ ఆమె మొండి పట్టు పట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago