Movie News

Bandla Ganesh: తాత తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ ఉండాలి.. గుర్తుపెట్టుకో బ్రదర్.. విజయ్ కి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్?

Bandla Ganesh: విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మాస్ స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు కొందరు హీరోలను ఉద్దేశించి మాట్లాడారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎలాంటి వారసత్వం లేకపోయినా తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నానని పరోక్షంగా విజయ్ దేవరకొండ కొందరు హీరోలకు కౌంటర్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ చేసిన ఈ వ్యాఖ్యల పై నిర్మాత నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాతలుతండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ అంటూ కామెంట్ చేశారు.

Bandla Ganesh: ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ వస్తుంటాయి… పూరి ఛార్మిలతో పాటు సెలబ్రెటీలను ఓ రేంజ్ లో ఆడుకున్న బండ్లన్న!

ఈ విధంగా బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్లు ఈట్వీట్ పై స్పందిస్తూ బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బండ్ల గణేష్ విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ తనపై ఇలా కౌంటర్ వేశారనీ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం బండ్ల గణేష్, రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ కి కౌంటర్ వేశారంటూ ఆయన పై మండిపడుతున్నారు.

ట్రెండ్ అవుతున్న ట్రైలర్..

మొత్తానికి లైగర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఇచ్చిన మాస్ స్పీచ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు చర్చలకు దారితీసింది. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈయన నటించిన ఈ లైగర్ సినిమా వచ్చేనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago