Samantha: సమంత తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ టాక్ షోలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.పెళ్లి తర్వాత తన జీవితం విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు గురించి ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సమంతకు నెపోటిజం గురించి కూడా పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో వారసత్వం గురించి ఈమె చేస్తున్న ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సమంత నెపోటిజం గురించి మాట్లాడుతూ ఆపిల్స్ రెండు ఒకేలా ఉండవని అలాగే ఇండస్ట్రీలో నేపో పిల్లలు..నాన్ నెపో పిల్లలు ఒకేలా ఉండరని ఈమె వెల్లడించారు. వారసత్వం నుంచి వచ్చినవారు హీరోలు అవుతుంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు స్టార్ హీరోలు అవుతున్నారని ఈమె పరోక్ష వెల్లడించారు.
ఇకపోతే నేపో పిల్లలు..నాన్ నెపో పిల్లలలో కూడా టాలెంట్ ఉంటుందని అయితే ఒక తండ్రి కోచ్ అయినప్పుడు తన పిల్లలను పక్కనుండి మాత్రమే ఆడించగలడు కానీ ఆ గేమ్లో గెలవడానికి ఆ తండ్రి ఏమాత్రం సహాయ పడడు. పూర్తిగా గెలవాలన్నది అతనిపై ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా సమంత నెపోటిజం గురించి పరోక్షంగా చైతన్యను ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారని తెలుస్తోంది.
వారసత్వం నుంచి వచ్చిన పిల్లలైనా తన తండ్రి ప్రమేయం రెండు మూడు సినిమాలు వరకే ఉంటుందని అనంతరం వారి టాలెంట్ తోనే ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.ఇక తన విషయానికొస్తే తాను సినిమాలో ఫెయిల్ అయితే కేవలం తన తల్లి తండ్రి సోదరుల వరకు మాత్రమే తెలుస్తుంది అయితే ఒక వారసత్వం నుంచి వచ్చిన వాళ్లు ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే వారి గురించి వారి తండ్రి తాతల గురించి దేశవ్యాప్తంగా తెలుసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది అంటూ సమంత ఈ సందర్భంగా వారసత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…