హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. మొన్ననే చెన్నయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగికి హైదేరాబద్ లో వైరస్ గుర్తించిన సంగతి తెలిసిందే.. ఇతను చెన్నై నుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చాడు.. తాజాగా మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరు మైండ్‌స్పేస్ బిల్డింగ్ నంబర్ 20 లో డిఎస్ఎమ్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి పరిమళగా అనుమానిస్తున్నారు. రెండు వారాల క్రితం ఈమె ఇటలీ వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తోంది.
దీనితో ఆ సంస్థతో పాటుగా మైండ్‌స్పేస్ లోని మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. మరి కొన్ని సంస్థలు కూడా తమ కార్యకలాపాలను మూసివేసినట్టు తెలుస్తోంది. పలు కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనీ ఆదేశించాయి. దీనితో కోవిడ్ 19 దెబ్బకు నిత్యం రద్దీగా ఉండే మైండ్‌స్పేస్ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది.
మరో పక్క ఆమెతో పాటు పని చేసే సహోద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనితో ఈ లక్షణాలు ఉన్న టెకీలు గాంధీ ఆసుపత్రి బాట పట్టారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు సమాచారం. బాధితుల్లో 16 మంది ఇటలీ కి చెందిన వారే. వీరంతా భారత పర్యటనలో ఉన్నారు.
కరోనా కారణంగా హొలీ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రులు నిర్ణయించారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి కి ప్రత్నామ్నాయంగా మరో ఆసుపత్రిని నిర్మించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…