RGV: ఆర్జీవీ ట్విట్టర్ లో మరో పోస్టు..! హీరోలందరూ.. బిక్షాటనకు వెళ్లారంటూ..!
RGV: వివాదస్పద సంచలన దర్శకుడు ఎప్పుడు ఏదో వివాదంలో ఉంటాడు. ఏదో ఒక ట్విట్ పెట్టి వివాదాన్ని రాజేస్తుండటం.. ఆర్జీవీకి అలవాటే. గతంలో పవన్ కళ్యాన్ పై.. తరువాత మెగా ఫ్యామిలీపై ఇలా వరసగా ట్విట్స్ చేశాడు. బన్నీనే సూపర్ స్టారంటూ.. మెగా ఫ్యామిలీ హీరోలను గెలికాడు.
ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్లపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇటీవల చిత్ర రంగంలోని పలు సమస్యల గురించి చర్చించేందుకు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్లు భేటీలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
జగన్ మోహన్ రెడ్డితో మీటింగ్ లో ముఖ్యంగా టికెట్ రేట్ల గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం జగన్ కూడా సినీ రంగాన్ని ఏపీలో కూడా విస్తరించాలంటూ.. ఓ ప్రతిపాదనను సినీ ప్రముఖుల ముందు ఉంచారు.
ఇదిలా ఉంటే ఈ భేటీపై ఆర్జీవి వ్యంగ్యంగా ట్విట్స్ చేశారు. చాలా సాధారణ ప్రజాప్రతినిధులుగా ఉండే.. వైఎస్ జగన్, పేర్నినానిలు సూపర్, మెగా, బాహుబలి స్టార్ల కన్నా పెద్ద స్టార్లుగా కనిపిస్తున్నారు. రీల్ స్టార్లు.. సూపర్ గా ఆరాధిస్తూ..ట్విట్లు చేశారని.. రియల్ స్టార్లు వైఎస్ జగన్, పేర్ని నాని ఈ ట్విట్లను కనీసం పట్టించుకోలేదన్న రీతీలో ఆర్జీవి ట్విట్ చేశారు. హీరోలందరూ.. బిక్షాటనకు వెళ్లి. .దేవుడిలాగా పొగిడారంటూ.. ఓమెగా స్టార్ జగన్ యే అంటూ మరో ట్విట్ చేశాడు. ఈ వ్యవహారం ఎటు టర్నింగ్ అవుతుందో చూడాలి.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…