Featured

హిందీ షోలే సినిమా రికార్డును బద్దలు కొట్టిన ఆనాటి ఎన్టీఆర్ సినిమా ఏమిటో తెలుసా…!!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 1977 ఒక మరపురాని సంవత్సరంగా పరిగణించవచ్చు. ఒకే సంవత్సరంలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ 1977 సంవత్సరాన్ని ఎన్టీఆర్ తన సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సందర్భం. ఈ సంవత్సరం ప్రారంభంలో పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ తరవాత సాంఘిక చిత్రం ‘అడవి రాముడు’ ఆ తర్వాత సోషియో ఫాంటసీ చిత్రం ‘యమగోల’ చిత్రాలతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విజయాలను ఎన్టీ రామారావు తన ఖాతాలో వేసుకున్నారు.

నెక్కంటి వీరవెంకట సత్యనారాయణ, ఆరుమళ్లీ సూర్యనారాయణ వీరిద్దరూ 1971 ప్రాంతంలో మద్రాస్ వచ్చి సత్య చిత్ర బ్యానర్ స్థాపించి అప్పటికే రెండు ఫ్లాపు సినిమాలు తీసి ఉన్నారు. అలా 1976 ప్రాంతంలో ఈ ఇద్దరూ కలిసి ఎన్టీ రామారావు గారి డేట్స్ ఎలాగో సంపాదించారు. అంతకుముందే తమ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రాఘవేంద్ర రావు గారు ఈ సినిమాకి దర్శకుడుగా ఎన్నుకున్నారు. అప్పటికి రాఘవేంద్రరావుకి టాలీవుడ్ లో మూడు సినిమాలు తీసారు. ‘బాబు (1975)’, జ్యోతి (1976), ‘రాజా (1976)’ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే వీటిలో ‘బాబు’ సినిమా యావరేజ్ గా నిలిస్తే.. ‘జ్యోతి’ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఇక ‘రాజా’ సినిమా ఫ్లాప్ సినిమాగా నిలిచింది.

కన్నడంలో హీరో రాజ్ కుమార్ ఒక అడవి నేపథ్యంలో తీసిన సినిమా ఘన విజయం సాధించడంతో అలాంటి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తీయాలనుకున్నారు. సిరి సిరి మువ్వ చిత్రానికి పని చేసిన రచయిత జంధ్యాలను ఈ సినిమాకి ఎంపిక చేసుకున్నారు. 1977 కంటే ముందు సీనియర్ హీరోయిన్ల తో చేసిన ఎన్టీఆర్ వయస్సు తగ్గించాడానికి జయప్రద, జయసుధ లను హీరోయిన్స్ గా ఎన్నుకున్నారు.
ఈ సంవత్సరము ప్రథమార్థంలో ప్రారంభమైన ‘దానవీరశూరకర్ణ’ చిత్రం పూర్తయిన తర్వాత దాదాపు ఏకధాటిగా 35 రోజుల డేట్స్ ని సత్య చిత్ర బ్యానర్ కి ఎన్టీ.రామారావు ఇవ్వడం జరిగింది.

ఈ సినిమా షూటింగును తమిళనాడు, కర్ణాటక సరిహద్దు అడవుల్లో చిత్రీకరించడం జరిగింది. చాలా అరుదుగా బయటకు వెళ్ళే ఎన్టీఆర్ 35రోజుల కాల్ షీట్స్ ఇచ్చి 6 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఈ సినిమా ముందు వరకూ అయన 3 నుంచి 4 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఇంచు మించు 3 నుంచి 3.5 లక్షలు వసూలు చేసేవారు. ఇక అడవిరాముడు షూటింగ్ సమయంలో తమ షూటింగ్ అవసరాల నిమిత్తం ఈ అడవి నుంచి 150 కిలోమీటర్లు వెళితే గాని మైసూరు పట్టణం వచ్చేది కాదు. ప్రభుత్వ అనుమతి పొంది అక్కడ తాత్కాలికంగా విద్యుత్తును, సెట్స్ తో కూడిన ఇళ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

అడవి నేపథ్యంలో కొనసాగే కథ కాబట్టి చెన్నైలోని సర్కస్ కంపెనీ నుంచి మూడు, నాలుగు ఏనుగులను తెప్పించడం జరిగింది. షూటింగ్ సందర్భంలో జయసుధ, జయప్రద లు ప్రయాణిస్తున్న ఎడ్లబండి యొక్క చక్రపు ఇరుసు పడిపోవడంతో జయప్రదకు పక్కటెముకలు విరగడంతో కొంత విశ్రాంతి తీసుకొని తిరిగి షూటింగ్లో పాల్గొనడం జరిగింది. అడవి రాముడు క్లైమాక్స్ లో జయసుధ, జయప్రద ఏనుగు మీద వెళుతున్నప్పుడు షూటింగ్ లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులు కేకలు వేయడంతో ఏనుగు వీరిని కింద పడేసి పరుగులు పెట్టింది. అలా అనేక ఇబ్బందులతో ఈ సినిమాని 1977 ఏప్రిల్ నెలలో విడుదల చేశారు.

అడవి రాముడు విడుదలైన తర్వాత ఆ సినిమా సృష్టించిన రికార్డ్స్ నభూతో న భవిష్యత్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ సినిమాలు శతదినోత్సవం జరుపుకోవడం అనేది ఒకే థియేటర్లో 80 రోజులు నాలుగు షోలు నడిస్తే మిగతా 20 రోజులు మూడు షో లు ఇలా వంద రోజులు పూర్తి చేస్తే ఆ సినిమా హిట్టు గా చెప్పుకోవడం జరిగేది. అడవి రాముడు సినిమాకు ముందు సినిమాలు 4 షోలతో ఒకటి రెండు వారాల తర్వాత 3 షోలతో నడిచేవి. అయితే, అడవి రాముడు నెల్లూరు కనకమహల్ థియేటర్‌లో 5 షోలతో 102 రోజులు నడిచారు. 3 షోలతో 198 రోజులు నడిచింది ఆతరువాత అభిమానుల అల్లరి తట్టులోలేక రాత్రికి రాత్రి సినిమా మార్చారు.

అలానే దేశం గర్వించదగ్గ చిత్రం ‘షోలే’ మహారాష్ట్రలో కేవలం 3 సెంటర్లలో మాత్రమే 365 రోజులు ఆడింది. కానీ అడవి రాముడు నాలుగు థియేటర్లలో 365 రోజులు ఆడింది. 4 సెంటర్లలో 365 రోజుల రన్ పూర్తి చేసుకున్న తొలి సినిమా కూడా ఇదే.. ఈ రకంగా చూస్తే షోలే చిత్రాన్ని కూడా అడవి రాముడు దాటేసిందని చెప్పవచ్చు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago