సినీరంగంలో కొన్ని పాత్రలకు కొంతమంది నటీనటులు మాత్రమే సరిపోతారు.అలాంటి పాత్రలలో వారు నటిస్తే ప్రేక్షకులు హర్షిస్తారు. ఆ తరహా పాత్రలో ముఖ్యమైనది “పోలీస్ పాత్ర” ఈ మధ్య కాలంలో పోలీస్ పాత్ర లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1980 చివరి దశకంలో పోలీస్ కథతో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
శారద ప్రధానపాత్రలో ఓ సినిమా నిర్మించాలనుకున్న డి.రామానాయుడు పరుచూరి బ్రదర్స్ కు చెప్పడంతో వారు “ప్రతిధ్వని” లాంటి పవర్ ఫుల్ కథను తయారు చేయడం జరిగింది.అది రామానాయుడుకు నచ్చడంతో శారదతో “ప్రతిధ్వని” చిత్రం నిర్మించారు.
1986 సురేష్ ప్రొడక్షన్స్, డి.రామానాయుడు నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో “ప్రతిధ్వని” చిత్రం విడుదలైంది. శారద ప్రధాన పాత్రలో నటించగా.. అర్జున్, రజిని హీరో, హీరోయిన్ గా నటించారు. ఊర్వశి శారద పోలీస్ పాత్రలో విజృంభించగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా చూసిన “సూర్య మూవీస్” అధినేత ఏ.ఎమ్. రత్నం…కిరణ్ బేడీ జీవితం ఆధారంగా విజయశాంతికి ఒక కథ రాయాలని పరుచూరి సోదరులను కోరడం జరిగింది. కొంత సమయం తీసుకొని వారు ఓ అద్భుతమైన పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని రాయడం జరిగింది. ఆ స్టోరీ ఏ.ఎం.రత్నం, మోహన్ గాంధీలకు నచ్చడంతో విజయశాంతితో సినిమా తీయడానికి సంసిద్ధులు అయ్యారు.
పరుచూరి బ్రదర్స్ అప్పటికీ ఆంధ్రాలో ఓ పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్ జీవితం ఆధారంగా వినోద్ కుమార్ పాత్రను తయారు చేశారు. విజయశాంతికి దీటుగా సరికొత్త విలనిజాన్ని పండించడానికి మొదటగా పరుచూరి గోపాలకృష్ణను అనుకున్నప్పటికీ ఆయన ఆ పాత్ర చేయడానికి నిరాకరించారు. అలా ఓ కొత్త వారిచే విలన్ పాత్ర చేయించాలనే ఉద్దేశంతో… ప్రముఖ నిర్మాత పుండరీకాక్షయ్యను సంప్రదించారు. తొలుత ఆయన ఈ పాత్ర చేయడానికి నిరాకరించారు. కానీ దర్శకుడు ఏ.మోహన్ గాంధీ పట్టుబట్టడంతో చివరికి “కర్తవ్యం” చిత్రంలో పుండరీకాక్షయ్య విలన్ గా కనిపిస్తారు.
సమాజంలో అర్ధబలం, అంగబలం గల ఒక రాజకీయ నాయకుడి పాత్రలో పుండరీకాక్షయ్య అద్భుతంగా అభినయించారు. లెక్కకు మించిన బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం విజయాన్ని సాధిస్తుందా.. అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. 1990లో కర్తవ్యం సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. అలాగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విజయశాంతికి జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…