Puneeth Rajkumar: పునీత్ ఇంట మరో విషాదం.. శోకసంద్రంలో పునీత్ కుటుంబ సభ్యులు!
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరణ వార్త నుంచి ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మంది అభిమానులు బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పునీత్ ఇంట మరో విషాద ఘటన చోటుచేసుకుంది.
పునీత్ రాజ్ కుమార్ మరణించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రతిక్షణం ఆయనను తలుచుకుంటూ పునీత్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ ఫిబ్రవరి 20వ తేదీ గుండెపోటుతో మరణించారు.
పునీత్ మరణవార్త ఆయనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేసిందని ఆయన మరణ వార్తను అనుక్షణం తలుచుకొని ఎంతో భావోద్వేగానికి గురి అయ్యే వారని ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని M.S రామయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా భర్త చనిపోయి ఐదు నెలల వ్యవధిలోనే తండ్రి కూడా మరణించడంతో అశ్విని తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే పునీత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక నేడు మధ్యాహ్నం రేవనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇలా భర్త మరణించిన వెంటనే తన తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…