ఏఎన్ఆర్ మల్టీస్టారర్ సినిమా వద్దన్నా చేశారు.. చివరకు ఇలా జరిగింది..

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారంటే.. అది అభిమానుల్లో ఎక్కువ అంచనాలకు తీసుకెళ్తుంది. మొదట్లో ఇలా మల్టీస్టారర్ సినిమాలు బాగానే వచ్చాయి. సీనియర్ హీరోలల్లో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఎన్నో సినిమాలను ఇలా మల్టీస్టారర్ గా చేశారు. అంతేకాకుండా విజయాలను కూడా అందుకున్నారు.

ఈ క్రమంలోనే అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జునతో కలిసి ఏఎన్ఆర్ సినిమాలలో నటించారు. శివ సినిమాతో నాగార్జున అప్పట్లో ఓ ట్రెండ్ ను సెట్ చేశారు. ఆ తర్వాత నాగార్జున నటించే సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఏఎన్నార్ తో కలిసి నాగార్జున మల్టీ స్టారర్ గా చేస్తే ఎలా ఉంటుందని శివ సినిమా నిర్మాతలు భావించారు. ఇలా వారిద్దరు కలిసి కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు వంటి సినిమాలు తీశారు.

తర్వాత మళ్లీ మూడో సారి వారిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని పలువురు నిర్మాతలు భావించారు. అయితే ప్రతీసారి ఇలాంటి ప్రయోగాలు విజయాన్ని అందుకోలేవని.. చాలామంది ఈ మల్టీస్టారర్ తీయకపోవడమే మంచిదని సలహాలు ఇచ్చినప్పటికీ ఏఎన్ఆర్ మాత్రం నాగార్జునతో కలిసి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఇద్దరూ ఇద్దరే” అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఈ సినిమాలో నాగేశ్వరరావు మంచివాడి పాత్రలో.. నాగార్జున చెడ్డవాడిగా నటించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ అయింది. దీనిని నాగార్జున అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అలాగే స్క్రీన్ ప్లే విషయంలో కూడా కోదండరామిరెడ్డి ప్రయోగం ఫలించలేదని చెప్పవచ్చు. ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమాలో ఒకే ఒక్క పాట హైలెట్ గా నిలిచింది. ‘ఓనమాలు నేర్పాలని అనుకున్నా.. అనే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.