Anup Rubens Wife: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అనూప్ రూబెన్స్ ఒకరు.తాజాగా జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ఇకపోతే బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే జీ తెలుగులో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా ప్రసారమైన ఎపిసోడ్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, సింగర్ ధనుంజయ,ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ వారి సతీమణులతో కలిసి హాజరయ్యారు. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తన సతీమణిని చాలా తక్కువగా కెమెరా ముందుకు తీసుకువస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ దంపతులకు ప్రేక్షకులను తమదైన శైలిలో ఎంటర్టైన్ చేశారు.ఇక వీరిద్దరూ వేదిక పైకి రాగానే అనూప్ రూబెన్స్ తన భార్యకు ప్రపోజ్ చేశారు. ఇలా అనుప్ రూబెన్స్ తనకి ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా ఆమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…