Meenakshi Chowdary: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా నిలదుక్కుకోవాలి అంటే తప్పనిసరిగా వారి మొదటి రెండు సినిమాలు మంచి హిట్ అయితేనే ఇండస్ట్రీలో వారికి ఎక్కువ కాలం పాటు మనగడ ఉంటుంది.అలాకాకుండా మొదటి రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోతే అలాంటి వారికి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం చాలా అరుదు.
ఈ క్రమంలోనే నటి మీనాక్షి చౌదరి సైతం నటించిన మొదటి రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
ఇలా రెండు సినిమాలు ఈమెకు డిజాస్టర్ అయినప్పటికీ నిర్మాత, హీరో నాని మాత్రం హిట్ 2 సినిమా కోసం ఈమెను సంప్రదించి తనకు అవకాశం ఇవ్వడం విశేషం.
ఈ విధంగా హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి మీనాక్షి చౌదరి ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ముచ్చటగా మూడోసారి నటించిన ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమా తన కెరీర్ కు ఎంతో ప్లస్ అవుతుందని తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె తమిళంలో ఓ సినిమాలో నటించారు.
ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక హిట్ 2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమెకు ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా రానున్నాయనీ చెప్పవచ్చు. మరి మీకు తెలుగులో ఎలాంటి అవకాశాలు వస్తాయో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…